![]() |
![]() |
.webp)
అగ్నిపరీక్ష నిన్న జరిగిన ఎపిసోడ్ చివర్లో ఓట్ అప్పీల్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. 90 డిగ్రీస్ టాస్క్ లో ఏ టీం గెలిచినా ఒక్కరికే ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుందని జడ్జెస్ చెప్తారు. దీంతో రెండు టీమ్స్ లో పోటీ ఇంకా రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఓట్ అప్పీల్ అంటే బయట జనాలకు తమని తము చూపించుకునే గోల్డెన్ ఛాన్స్. టాస్క్ లో ఝాన్సీ టీం గెలవడంతో ఫస్ట్ ఓట్ అప్పీల్ వాళ్లకే వెళ్లింది. ఝాన్సీ లీడర్ గా తన టీంలో ఎవరు బాగా హోల్డ్ చేశారో చూసి డిసైడ్ చేయాలి. లాస్ట్ వరకు మిథిలేష్, హేమంత్ ఇద్దరూ అద్భుతంగా నిలబడ్డారు. కానీ హేమంత్ ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడని ఝాన్సీ ఫీల్ అయింది. అందుకే తన టీం తరపున హేమంత్ కి ఓట్ అప్పీల్ ఇచ్చేసింది.
ఇక రెండో ఓట్ అప్పీల్ షాలినీకి వచ్చింది. ఇది టాస్క్ గెలిచినందుకు కాదు. జ్యూరీ మెంబర్స్ మొత్తం ఎపిసోడ్ లో షాలినీ ఆడిన తీరును చూసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా అనౌన్స్ చేశారు. బాల్ టాస్క్ లో రామకృష్ణకి గట్టిగా కౌంటర్ ఇవ్వడం. లీడర్ అయ్యాక టీంని మేనేజ్ చేయడం, స్వాప్ కార్డు వచ్చాక చాలా తెలివిగా ప్రియాంకను తీసేసి ఝాన్సీని పెట్టడం.. వాదించడం.. డిఫెండ్ చేసుకోవడం ఇవన్నీ నచ్చి ఆమెకు కూడా ఓట్ అప్పీల్ ఇచ్చారు.
ఈ ఎపిసోడ్ లో షాక్ ఇచ్చిన విచయం ఏంటంటే ఎల్లో కార్డ్. ఎందుకంటే రామకృష్ణకి ఎల్లో కార్డు వస్తుంది. ఆట మధ్యలో రూల్స్ మర్చిపోయి.. నేను లీడర్ ని నన్ను ఎలా ఔట్ చేస్తావంటూ షాలినీతో వాగ్వాదానికి దిగడం.. గేమ్ అర్థం చేసుకోకుండా బిహేవ్ చేయడం జ్యూరీకి నచ్చలేదు. అందుకే వార్నింగ్ గా అతనికి ఎల్లో కార్డ్ ఇచ్చేశారు. ఓవరాల్ గా చూస్తే ఈ ఎపిసోడ్ లో ఇద్దరికి లాభం, ఒకరికి నష్టం జరిగింది. హేమంత్, షాలినీ ఇద్దరూ ఓట్ అప్పీల్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక రామకృష్ణ మాత్రం ఎల్లో కార్డ్ తో డేంజర్ జోన్ లో పడ్డాడు.
![]() |
![]() |